మరొకరిని పెళ్లి చేసుకుందని దారుణం.. ప్రియురాలిని 6 భాగాలుగా కోసి..

21 Nov, 2022 10:44 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లక్నో: శ్రద్దా వాకర్‌ హత్య కేసు వెలుగులోకి వచ్చి 10 రోజులు గడుస్తున్నా.. నిందితుడి అఫ్తాబ్‌ విచారణలో ఇంకా అనేక విషయాలు ఒక్కొక్కటిగా తెరమీదకు వస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున జరిగిన ఈ హత్య ప్రతి ఒక్కరి వెన్నులో వణుకు పుట్టించింది. ఈ ఉదంతం అనంతరం ఇలాంటి కోవకే చెందిన మరిన్ని కేసులు నమోదవుతుండటం కలవరానికి గురిచేస్తున్నాయి. కారణాలేవైనా ప్రియుడి చేతిలో ప్రియురాలు దారుణంగా హత్యకు గురైన వార్తలు ఇటీవల ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకున్నాయి. జీవితాంతం కలిసి ఉంటామని నమ్మించిన వాడి చేతులోనే అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు. 

తాజాగా యూపీలో మరో ఘోరం జరిగింది. మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందనే కోపంతో ప్రియురాలిని ప్రియుడు గొండు నులిమి చంపాడు. అనంతరం ఆమె శరీరాన్ని ఆరు భాగాలుగా కోసి బావిలో పడేశాడు. వివరాలు.. ప్రిన్స్‌ యాదవ్‌ అనే యువకుడు 20 ఏళ్ల వయసున్న ఆరాధనను ప్రేమించాడు. అయితే యువతి ఇతన్ని కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లి అనంతరం కూడా యాదవ్‌తో వివాహేతర సంబంధం కొనసాగించింది. యువతి మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన యాదవ్‌.. తన తల్లిదండ్రులు, బంధువు సర్వేశ్‌, ఇతర బంధువులతో కలిసి ఆమెను అంతమొందించేందుకు ప్లాన్‌వేవాడు. 

మాట్లాడాలని చెప్పి నవంబర్‌ 9న ఆరాధనను బైక్‌పై గుడికి తీసుకెళ్లి సర్వేష్ సహాయంతో చెరకు తోటలో ఆమె గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఆమె మృతదేహాన్ని ఆరు భాగాలుగా నరికి పాలిథిన్ సంచిలో వేసి కొంత దూరంలో బావిలో పడేశారు. నవంబర్‌ 15న పశ్చిమి గ్రామం శివారులో ఉన్న బావిలో ఓ యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. చనిపోయిన యువతిని ఆరాధనగా గుర్తించారు.  ఆమె సెల్‌ఫోన్‌ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు  నిందితుడు ప్రిన్స్‌ యాదవ్‌ను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు.
చదవండి: షాకింగ్.. పట్టాలు తప్పి ప్లాట్‌ఫాం పైకి దూసుకెళ్లిన రైలు.. ముగ్గురు మృతి..

హత్య చేసిన మృతదేహాన్ని గుర్తించేంఉదకు నిందితుడిని పోలీసులు సంఘటన స్థలానికి తీసుకెళ్లారు. అ క్రమంలో యాదవ్‌ తప్పించుకునే ప్రయత్నంలో ఇంతకుముందే సదరు ప్రదేశంలో దాచిపెట్టిన పిస్టోల్‌తో పోలీసులపైకి కాల్పులు జరిపారు. అప్రమత్తమైన పోలీసులు అతనిపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నిందితుడి కాలుకు బుల్లెట్‌ గాయమైంది.  ఈ కేసులో ఇప్పటివరకు పదునైన ఆయుధం, కంట్రీ మేడ్ పిస్టల్, క్యాట్రిడ్జ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు