గొడవపడి చెవి కొరికేశాడు 

8 Sep, 2021 04:30 IST|Sakshi

గిద్దలూరు: ఓ ఆటో డ్రైవర్‌ మరో ఆటో డ్రైవర్‌తో గొడవపడి అతడి చెవి కొరికేశాడు. దీంతో చెవి పూర్తిగా తెగి కిందపడిపోయింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం పొదలకుంటపల్లెలో జరిగింది. పొదలకుంటపల్లెకు చెందిన కాల్వ భాస్కర్, తాటిచర్ల వెంకటేశ్వర్లు ఇద్దరూ వారి గ్రామం నుంచి గిద్దలూరు వరకు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు.

ప్రయాణికులతో మంగళవారం గిద్దలూరు వచ్చిన వారు తిరిగి ప్రయాణికులను తీసుకెళ్లేందుకు సీరియల్‌ విషయంలో గొడవపడ్డారు. దీంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఘర్షణలో భాస్కర్‌ చెవిని వెంకటేశ్వర్లు కొరికేయడంతో చెవి తెగి కిందపడిపోయింది. తీవ్ర రక్తస్రావమైన భాస్కర్‌ను ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించారు.  

మరిన్ని వార్తలు