భూతవైద్యం పేరుతో మోసం 

9 Jul, 2021 14:58 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, ఏటూరునాగారం(వరంగల్‌): ఆరోగ్యం బాగోలేకపోవడంతో దయ్యం పట్టిందని వైద్యం చేస్తానని చెప్పి మాయమాటలు చెప్పి రూ.16,500 నగదు, రెండు తులాల పుస్తెలతాడు తీసుకొని ఓ ప్రబుద్దుడు పరారైన సంఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం శంకరాజుపల్లిలో గురువారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కొండగొర్ల రమేష్, ఎల్లమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు రాధిక, రవళి, రమ్య ఉన్నారు.

అందులో చిన్న కు మార్తెకు కడుపులో నొప్పి ఉండడంతో గత ఏడాది శ స్త్ర చికిత్స చేయించారు. అయితే వారి ఇంటి ముందుకు బైక్‌పై ఓ భూతవైద్యుడు వచ్చి మీ ఇంటిలో ఒ కరి ఆరోగ్యం బాగులేదు, కొన్ని మంత్రాలతో న యం చేస్తానని మాయమాటలు చెప్పాడు. భూతవైధ్యానికి సంబంధించిన వస్తువులను తెప్పించుకున్నా రు. నగదు రూ.16,500, బంగారు ఆభరణం కావా లని చెప్పడంతో నమ్మిన రమేష్‌ భార్య నగదుతోపా టు తన మెడలోని రెండు తులాల పుస్తెలతాడును అతడికి ఇచ్చింది.

దీంతో సదరు వ్యక్తి ఏదో పూజ చేస్తున్నట్లు నాటకమాడి రమేష్‌ దంపతులను కల్లుమూసుకొని చెప్పి అక్కడి నుంచి బైక్‌పై పరారు అయ్యా డు. ఇక తాము మోసపోయామని గుర్తించి లబోది బోమన్నారు. గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినప్పటికీ అవి పనిచేయకపోవడం బాధాకరమని స్థానికులు వాపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్‌ రెడ్డి తెలిపారు. 

మరిన్ని వార్తలు