మహిళా ఆర్‌ఎంపీ నెంబర్‌ తీసుకుని.. ఫోన్లు, మెసేజ్‌లు.. ఏకంగా క్లినిక్‌కు వెళ్లి..

20 Sep, 2021 18:04 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వ్యక్తిపై కేసు నమోదు

సాక్షి, మొయినాబాద్‌(రంగారెడ్డి): మహిళా ఆర్‌ఎంపీ డాక్టర్‌ పట్ల అసభ్యకరంగా ప్రవర్థించిన వ్యక్తిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ సంఘటన మండల పరిధిలోని పెద్దమంగళారంలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దమంగళారం గ్రామానికి చెందిన దళిత మహిళ(28) ఆర్‌ఎంపీ డాక్టర్‌గా పనిచేస్తూ గ్రామంలోనే క్లినిక్‌ నడుపుతుంది. అదే గ్రామానికి చెందిన పాటి ప్రసాద్‌రెడ్డి అనే వ్యక్తి గత వారం రోజుల క్రితం క్లినిక్‌కు వెళ్లి చూపించుకున్నాడు. అదే సమయంలో ఆమె సెల్‌ నంబర్‌ తీసుకుని అప్పటి నుంచి ప్రతిరోజు ఫోన్లు చేస్తూ, మెసేజ్‌లు చేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు.

ఈనెల 17న మళ్లీ క్లినిక్‌కు వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. లైంగిక దాడికి యత్నించడంతో ఆమె ప్రతిఘటించి క్లినిక్‌ నుంచి వెళ్లగొట్టింది. రాత్రి ఇంటికి వెళ్లాక కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. కుటుంబ సభ్యులు అతన్ని అడగడానికి ఇంటికి వెళ్లగాఅప్పటికే అతడు పరారయ్యాడు. మొయినాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాధితురాలి వాంగ్మూలం మేరకు అతనిపై నిర్భయ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. నిందితుడిని త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.  
చదవండి: సరిగా కూర్చోవాలని అన్నందుకు ఐరన్‌ రాడ్‌తో టీచర్‌పై..
కుటుంబం ఆత్మహత్య: తండ్రి వివాహేతర సంబంధమే కారణం!

మరిన్ని వార్తలు