భార్య భర్తల మధ్య గొడవ.. భర్తఅదృశ్యం..

29 Jun, 2021 09:25 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,  హోసూరు(తమిళనాడు): అత్తలవాడి గ్రామానికి చెందిన రవి (37) తళి బీడీవో కార్యాలయం వద్ద టీఅంగడి నిర్వహిస్తున్నాడు. గత ఏడాది క్రితం బ్యాంకులో రూ. 5 లక్షల అప్పు తీసుకొన్నాడు. ఈ విషయమై  25వ తేదీ భార్యాభర్తల మధ్య గొడవలేర్పడింది.

దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రవి బైక్‌పైన ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. రాత్రి అయిన ఇంటికి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన భార్య శిల్ప తళి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసును నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చేపట్టారు. 

చదవండి: ఎంపీ అర్వింద్‌ వాహనంపై దాడి... 

మరిన్ని వార్తలు