అన్నంలో విషం: తల్లి, సోదరి దారుణ హత్య

30 Nov, 2020 09:03 IST|Sakshi
నిందితుడు సాయినాథ్‌ రెడ్డి (ఫైల్‌ఫోటో)

సాక్షి, మేడ్చల్ : ఐపీఎల్ బెట్టింగ్‌లకు, జల్సాలకు బానిసైన యువకుడు తల్లికి, సోదరికి విషం హతమార్చిన  సంఘటన వెలుగులోకి వచ్చింది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రావలకోల్ గ్రామానికి చెందిన సాయినాథ్‌రెడ్డి తండ్రి ప్రభాకర్ రెడ్డి ఇటీవల అకాల మరణ​ చెందడంతో అతడి పేరిట ఉన్న ఇన్సూరెన్స్ 20 లక్షలు నగదు అందింది. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న సాయినాథ్‌ రెడ్డి దురలవాట్లకు బానిసయ్యాడు. జులాయిగా తిరుగుతూ మొత్తం డబ్బులను ఖర్చు చేశాడు. ఈ విషయంపై తల్లి, చెల్లిలు ఎక్కడ నిలదీస్తారోనని భయపడిన అతను ఈ నెల 23న ఉదయం అన్నం వండి అందులో విషం కలిపి తల్లి సునీతా రెడ్డి (42), సోదరి అనూష (20)లకు పెట్టాడు. (విషాదం: హెచ్‌సీయూ ప్రొఫెసర్‌ ఆత్మహత్య)

పథకం ప్రకారం ముందే సిద్ధం చేసుకున్న ఆహారాన్ని తీసుకుని ఆఫీసుకు వెళ్లాడు. మధ్యాహ్నం అన్నం తిన్న సునీత, అనూష అస్వస్థతకు గురయ్యారు. తల్లి సునీత కుమారుడికి ఫోన్‌ చేసి ఆ తిన్నం తినవద్దని చెప్పింది. 23వ తేదీ సాయంత్రం ఇంటికి తిరిగివచ్చిన సాయినాథ్‌ రెడ్డి అపస్మారక స్థితిలో ఉన్న తల్లి, చెల్లిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సునీత 27న మృతిచెందగా.. అనుష 28మ కన్నుమూసింది. ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందిందని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానికి సీఐ ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. నిందితుడు సాయిని అరెస్ట్‌ చేసిన పోలీసులు పోలీస్‌ కస్టడీకి తరలించి విచారిస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా