మనిషి కాదు.. మృగం! 

17 Feb, 2021 13:00 IST|Sakshi
నిందితుడు సోమశేఖర్‌

వీధికుక్కపై లైంగికదాడి 

మైసూరు: మైసూరులో సభ్యసమాజం తలదించుకునే అమానుషం ఆలస్యంగా వెలుగుచూసింది. ఓ యువకుడు వీధి కుక్కపైన లైంగిక దాడికి పాల్పడగా కొందరు వీడియో తీసి సోషల్‌మీడియాలో పెట్టడంతో వైరల్‌ అయ్యింది. మైసూర్‌లోని గోకులం 3వ స్టేజ్‌లో నివసించే సోమశేఖర్‌ (26) ఈ నెల 11న రాత్రి సమయంలో సందులో చాటుగా వీధి కుక్కపైన లైంగిక దాడికి పాల్పడుతుండగా, కొందరు యువకుల వీడియో తీసి సోషల్‌ మీడియాలో వ్యాప్తి చేశారు. పీపుల్‌ ఫర్‌ అనిమల్స్‌ (పీఎఫ్‌ఎ) అనే స్వచ్ఛంద సంస్థ వీవీపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. జంతువులపై లైంగికదాడి జరిపాడన్న అభియోగాలతో కేసు నమోదు చేసి నిందితున్ని సోమవారం అరెస్టు చేశారు. కుక్కను గుర్తించి వైద్య పరీక్షలు చేయిస్తామని తెలిపారు.   

చదవండి:పార్లమెంట్‌ హౌజ్‌లోనే అత్యాచారం 

మరిన్ని వార్తలు