మాదాపూర్‌: ప్రేయసిపైనే అత్యాచారం.. ఆపై దారుణ హత్య

23 Feb, 2022 20:13 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌:  ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలిపైనే  అత్యాచారం చేసి.. ఆమె ప్రాణం తీశాడో ప్రియుడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మాదాపూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లాలుప్రసాద్‌ అనే యువకుడు హైటెక్‌సిటీ ఔట్‌పోస్ట్  వద్ద తన ప్రేయసిపై అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేశాడు.

ఈ కేసులో పోలీసులు నిందితున్ని సీసీటీవీ కెమెరాల ఆధారం పట్టుకొని అరెస్ట్‌ చేశారు. తనతో కాకుండా నరేష్‌ అనే యువకునితో సన్నిహితంగా ఉంటుందనే అక్కసుతోనే తను ఆమెను అత్యాచారం చేసి.. హత్య చేసినట్లు పోలీసులు ముందు లాలుప్రసాద్‌ ఒప్పుకున్నాడు. 

మరిన్ని వార్తలు