యువతిని వేధించి.. కానిస్టేబుల్‌పై దాడిచేసి..

7 Oct, 2020 11:42 IST|Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: జంగారెడ్డి గూడెంలో రోహిత్‌ అనే యువకుడు హరిప్రియ అనే యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో యువతిని కాపాడేందుకు వెళ్లిన కానిస్టేబుల్‌పై కూడా దాడి చేశాడు. దీంతో రోహిత్‌పై జంగారెడ్డిగూడెం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే రోహిత్‌ పోలీసులు తనపై అక్రమంగా కేసు పెట్టారంటూ నిన్న రాత్రి నుంచి సెల్‌ టవర్‌ ఎక్కి నిరసన తెలుపుతున్నాడు. ఈ క్రమంలో సెల్‌టవర్‌పై తేనేటీగలు ఒక్కసారిగా చెలరేగడంతో రోహిత్‌ కేబుల్‌ వైర్లు పట్టుకుని కిందకు దూకేశాడు. తేనేటీగలకు భయపడి స్థానికులు భయంతో పరుగులు తీశారు. దీంతో గాయపడిన రోహిత్‌ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. 

మరిన్ని వార్తలు