బీచ్‌లో లైంగిక దాడి.. ఆ వీడియోని పదే పదే చూపిస్తూ..

2 Aug, 2022 14:00 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

యశవంతపుర(బెంగళూరు): విద్యార్థినిపై అత్యాచారం చేసి, అనంతరం వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న నిందితుడిని మంగళూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. చేపల లారీకి డ్రైవర్‌గా పని చేస్తున్న మునాజ్‌ అహమ్మద్‌(30) జులై 27న మంగళూరు ఎన్‌ఐటీకే  బీచ్‌కి వెళ్లాడు. అక్కడ ఉన్న  విద్యార్థినులను బెదిరించాడు. ఒక అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడి వీడియో తీశాడు.

అనంతరం ఆ వీడియోను ఆమెకు పదేపదే చూపించి వేధించటం ప్రారంభించాడు. బాధితురాలు మంగళూరు పోలీసు కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేయటంతో పోలీసులు గాలింపు చేపట్టి నిందితుడిని అరెస్ట్‌ చేశారు.

చదవండి: Hyderabad Crime News: భరించలేని తలనొప్పి, వాంతులు, నోట్లో నుంచి నురుగ వచ్చి

మరిన్ని వార్తలు