కూర కావాలని వెళ్లి.. ఆపై కడుపులో తన్ని.. వివాహితపై లైంగికదాడి

17 Sep, 2022 19:30 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, నల్లగొండ: వివాహితపై ఓ కామాంధుడు లైంగికదాడి చేశాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా వేములపల్లి మండల పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ శ్రీను తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.  మండల కేంద్రంలోని ఎన్‌ఎస్పీ కాలనీకి చెందిన వివాహిత ఈనెల 13న మధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా ఉంది. ఈ సమయంలో సమీప బంధువు గుండెబోయిన సైదులు కూర కావాలని ఆమె ఇంట్లోకి వెళ్లాడు. అనంతరం ఆమె చేయి పట్టుకోవడంతో ప్రతిఘటించగా కడుపులో బలంగా తన్ని ఆపై లైంగికదాడి చేసి పరారయ్యాడు.

బాధితురాలు కడుపునొప్పితో బాధపడుతూ కేకలు వేయగా పక్కింట్లోని మట్టమ్మ వెళ్లింది. రక్తస్రావంతో బాధపడుతున్న బాధితురాలిని చూసి ఆమె భర్తకు సమాచారం ఇచ్చింది. అనంతరం ఆటోలో ఆమెను మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. నాలుగు రోజులుగా చికిత్స పొందుతుండగా శుక్రవారం బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.  నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.  
చదవండి: వరుడు నచ్చకపోయినా వివాహం.. పెళ్లయిన పదిరోజులకే..

మరిన్ని వార్తలు