తూర్పుగోదావరి: ఆడుకోడానికి వెళ్లిన మైనర్‌ బాలికపై అత్యాచారం

9 Dec, 2021 19:55 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, తూర్పుగోదావరి: కడియం మండలంలోని కడియపులంక పంచాయతీ పరిధఙలోని బుర్రిలంకలో మైనర్‌ బాలికపై ఒక కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఒక నర్సరీలో పనిచేసేందుకు విశాఖ జిల్లా వి. మాడుగుల మండలం, వీరనారాయణపురానికి చెందిన భార్యభర్తలు, తమ ఇద్దరు కుమార్తెలతో వచ్చారు. వీరు ఉండే ఇంటికి సమీపంలోనే నివాసం ఉండే మారాజు కన్నంనాయుడు వీరి అయిదేళ్ల కుమార్తెలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

ఇంటి ముందు ఆడుకునేందుకు వెళ్లిన కుమార్తె ఇంతకీ రాకపోవడంతో ఆమెను వెతుక్కుఉంటూ వెళ్లిన తల్లి కన్నంనాయుడు ఇంట్లో గుర్తించింది. బాలికపై అత్యాచారం జరిగినట్లు గమనించిన తల్లిదండ్రులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కడియం ఎస్సై షేక్‌ అమీనా బేగం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దిశ డీఎస్పీ కె. తిరుమలరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి తల్లిదందడ్రుతో మాట్లాడారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చదవండి: తగ్గిస్తే పోయేది.. కుదరదన్నాడు.. చివరికి ప్రాణమే పోయింది

బంధువుల ఇంట్లో గృహ ప్రవేశం.. పెరుగు తెస్తానని వెళ్లి

మరిన్ని వార్తలు