సైదాబాద్‌లో దారుణం.. ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి

10 Sep, 2021 11:11 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి

సాక్షి, హైదరాబాద్‌: సైదాబాద్‌ సింగరేణి కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఆరేళ్ల చిన్నారిపై రాజు అనే యువకుడు లైంగిక దాడి చేసి హత్యకు పాల్పడ్డాడు. గురువారం సాయంత్రం 5 గంటల నుంచి చిన్నారి అదృశ్యమైంది. అర్ధరాత్రి 12 గంటలకు నిందితుడు రాజు ఇంట్లో చిన్నారి మృతదేహం లభ్యమైంది.

నిందితుడు రాజును తమకు అప్పగించే వరకు మృతదేహాన్ని కదిలించేది లేదని బస్తీవాసులు ఆందోళనకు దిగారు. స్థానికులు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాలనీలో 100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. నిందితుడు రాజు పరారీలో ఉండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

స్థానికులు, బంధువులు నిరసన..
బాలిక హత్యాచారం ఘటనలో నిందితుడు రాజును బహిరంగంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. ఆగ్రహంతో రహదారిపై వాహనాలను అడ్డుకుంటున్నారు. సాగర్‌ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నారు. కర్మన్‌ఘాట్‌-చంపాట్‌ రహదారిపై చిన్నారి బంధువులు ఆందోళన చేపట్టారు. బాధితుల కుటుంబాలకు జిల్లా కలెక్టర్‌ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆరేళ్ల చిన్నారి తల్లితో కలెక్టర్‌ మాట్లాడారు.

ఇవీ చదవండి:
రూ.11 లక్షల నగదుతో డీఎస్పీ పరుగులు 
డ్రెస్‌ మార్చుకుంటుండగా వీడియో.. బ్లాక్‌ మెయిల్‌ చేసి

మరిన్ని వార్తలు