కూలీ డబ్బులు అడిగినందుకు మహిళపై దారుణం

11 Jul, 2021 15:58 IST|Sakshi

పాట్నా : కూలీ డబ్బులు అడిగిందని మహిళపై అత్యాచారం చేశాడో వ్యక్తి. బిహార్‌ రాష్ట్రంలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బిహార్‌లోని కతిహార్‌కు చెందిన ఓ మహిళ అక్కడే ఓ వ్యక్తికి చెందిన పొలంలో పని చేస్తోంది. నాలుగు రోజుల క్రితం తనకు రావాల్సిన కూలీ డబ్బులు ఇవ్వాలని తన యజమానిని అడిగింది. డబ్బు ఇస్తానని చెప్పి, ఓ చోట కొంత పని ఉందని పొలంలోకి ఆమెను తీసుకెళ్లాడు. అనంతరం తుపాకి చూపి బెదిరించి అత్యాచారం చేశాడు. దాన్నంతా వీడియో తీశాడు.

ఈ విషయం బయట చెబితే వీడియో సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరించాడు. దీంతో భయపడిపోయిన ఆమె విషయం బయటకు చెప్పలేదు. అయితే సదరు నిందితుడు మాట తప్పి, వీడియోను ఆన్‌లైన్‌లో ఉంచాడు. ఈ నేపథ్యంలో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడ్ని, అతడి తమ్ముడ్ని అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు