మహిళను పెళ్లి చేసుకుంటానని లోబర్చుకొని.. చివరకు..

27 Jul, 2021 13:53 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, గార్ల(వరంగల్‌): మహిళను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి శారీరకంగా వాడుకొని, పెళ్లికి నిరాకరించిన వ్యక్తిపై కేసు నమోదైన సంఘటన సోమవారం కోట్యానాయక్‌తండాలో చోటుచేసుకుంది. ప్రొహిబిషనరీ ఎస్సై జాటోత్‌ ఝాన్సీ కథనం ప్రకారం.. గార్ల మండలం కోట్యానాయక్‌తండాకు చెందిన భూక్యా చిన్ని భర్త గత ఆరు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. చిన్నికి 10 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. 

అదే గ్రామానికి చెందిన ధరంసోత్‌ నందు, భూక్యా చిన్నిని పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి లోబర్చుకొని శారీరకంగా వాడుకొని గర్భవతిని చేశాడు. తీరా పెళ్లి చేసుకోవాలని చిన్ని నందును ఒత్తిడి చేయగా, తనకు ఇదివరకే పెళ్లి అయ్యిందని, మళ్లీ పెళ్లి ఎలా చేసుకోవాలని నందు పెళ్లికి నిరాకరించాడు. గ్రామంలో పెద్దమనుషులు చెప్పినా వినకపోవడంతో గత్యంతరం లేక బాదిత మహిళ చిన్ని నందుపై గార్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈమేరకు ప్రొబెషనరీ ఎస్సై నందుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.   

మరిన్ని వార్తలు