పెళ్లి చేసుకుంటానని పిలిచి లాడ్జికి తీసుకెళ్లి..

22 Aug, 2021 11:52 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,పశ్చిమగోదావరి: పెళ్లి చేసుకుంటానని పిలిచి బాలికపై అత్యాచారానికి పాల్పడిన యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ద్వారకాతిరుమల ఎస్సై టి.వెంకట సురేష్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పంగిడిగూడెంకు చెందిన 15 ఏళ్ల బాలికకు, నల్లజర్ల మండలం చోడవరం గ్రామానికి చెందిన పెయింటర్‌ బుద్దాల అంజిబాబుతో ఏడాదిన్నర క్రితం పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నట్టు నమ్మించి, పెళ్లి చేసుకుంటానని ఈనెల 19న బాలికను ద్వారకాతిరుమలకు రప్పించాడు.

అనంతరం ఒక లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తరువాత బస్టాండ్‌కు తీసుకెళ్లి విడిచిపెట్టాడు. తనకు పెళ్‌లైందని, ఇంటికి వెళ్లిపోమని చెప్పి అంజిబాబు అక్కడి నుండి వెళ్లిపోయాడు. దీంతో బాలిక ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపి, స్థానిక పోలీస్టేషన్‌లో అదే రోజు రాత్రి ఫిర్యాదు చేసింది. ఫోక్సో చట్టం కింద కేసునమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. 

చదవండి: ప్రొఫైల్‌ పెడితే.. రూ.25 వేలు మాయం

మరిన్ని వార్తలు