భవన నిర్మాణ కార్మికుడి పైశాచికం.. బాలికను బెదిరించి..

19 Jul, 2021 10:21 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, కెలమంగలం (కర్ణాటక): అంచెట్టి తాలూకా వన్నాతిపట్టి గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు మాదప్పన్‌(26). ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఇతడు ఓ నిర్మాణ పనులకోసం వెళ్లి 16 ఏళ్ల బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. శనివారం బాలిక అనారోగ్యానికి గురి కావడంతో తల్లిదండ్రులు డెంకణీకోట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన డాక్టర్లు బాలిక రెండు నెలల గర్భవతిగా తేల్చారు. దీంతో తల్లిదండ్రులు మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మాదప్పపై పోక్సో కేసు నమోదు చేసి తీవ్రంగా గాలిస్తున్నారు.  

వివాహిత ఆత్మహత్య 
హోసూరు: దంపతుల మధ్య ఏర్పడిన గొడవ ఒకరి ఆత్మహత్యకు దారి తీసింది. వివరాలు... ఊత్తంగేరి సమీపంలోని పెరుమాళ్‌కుప్పం గ్రామానికి చెందిన గుణశేఖరన్, విజయలక్ష్మి (24)కి మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఒక పాప ఉంది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. శనివారం రాత్రి కూడా రగడ జరగడంతో జీవితంపై విరక్తి చెందిన విజయలక్ష్మీ ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఊత్తంగేరి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.    

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు