యువతిపై హత్యాయత్నం 

19 Jul, 2021 09:00 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, జడ్చర్ల(మహబూబ్‌నగర్‌): చదివించిన తనను గాకుండా ఇతరులను పెళ్లి చేసుకుంటే  హత్య  చేస్తానంటూ ఓ వ్యక్తి యువతిపై కత్తితో దాడికి యత్నించిన సంఘటన పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ అభిషేక్‌రెడ్డి కథనం మేరకు.. మిడ్జిల్‌ మండలం కొత్తపల్లికి చెందిన మానసను మేనమామ కుమారుడు లింగం పెళ్లి చేసుకుంటానంటూ మానస, ఆమె తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొచ్చాడు.

దీనికి వారు ఒప్పుకోకపోవడంతో ఆదివారం లింగం జడ్చర్లలో మానస టెక్నీషియన్‌గా పనిచేస్తున్న ల్యాబ్‌కు చేరుకొని తనను పెళ్లి చేసుకోవాంటూ బలవంతం చేశాడు. దీనికి అంగీకరించకపోవడంతో తన వెంట తెచ్చుకున్న సంచిలో నుంచి కొబ్బరి బొండాల  కొట్టే  కత్తి  తీసి  హత్య  చేసేందుకు యత్నించాడు.  అతడి నుంచి  తప్పించుకొని పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని ఫిర్యాదు చేసింది. దాడికి సంబంధించిన చిత్రాలు ల్యాబ్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్లు వివరించింది. యువతి ఫిర్యాదు మేరకు లింగంపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు.    
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు