మరిది చేతిలో వదిన హతం.. వివాహేతర సంబంధమే కారణమా?

9 Sep, 2022 09:04 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

హుబ్లీ (బెంగళూరు): మరిది చేతిలో వదిన దారుణ హత్యకు గురైన ఘటన జిల్లాలోని కుందగోళ తాలూకా ఏరినారాయణపుర గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. హతురాలు సునంద మెణసినకాయి కాగా నిందితుడిని మంజునాథగా గుర్తించారు. కుటుంబ కలహాలు తీవ్ర స్థాయికి చేరడంతో ఈ హత్య జరిగిందని తెలుస్తోంది.

కొడవలితో పట్టపగలే హత్య జరగడంతో గ్రామంలో భయాందోళనకర పరిస్థితి తలెత్తింది. కుందగోళ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. వివాహేతర సంబంధమా? మరేదైనా కారణమా అన్న కోణంలో హత్యకు గల కారణాలపై ఆరా తీశారు.

చదవండి: (నగల వ్యాపారి హనీట్రాప్‌లో కొత్త ట్విస్ట్‌)

మరిన్ని వార్తలు