Man Poses Ahmedabad Police Commissioner: పోలీస్‌ కమిషనర్ పేరుతో పోలీసులనే బురిడి కొట్టించాడు!!

31 Dec, 2021 17:12 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కొన్ని సంఘటనలు చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇటీవల దొంగలు కూడా రూటు మార్చారనే చెప్పాలి. ఇదివరకు దొంగలు అమాయకులు, ఒంటరివాళ్లను, వృద్ధులను టార్గెట్‌ చేసి మోసాలకు పాల్పడేవారు. ఇ‍ప్పుడు అత్యున్నతస్థాయి ఉద్యోగులను, బ్యాంకు ఉద్యోగులనే కాక ఏకంగా పోలీసులునే బురిడి కొట్టిస్తున్నారు. అచ్చం అలాంటి సంఘటనే మహారాష్ట్రలో చోటు చేసుకుంది.

(చదవండి: మృత్యుంజయురాలు! ...ఐదు రోజులుగా గడ్డకట్టే మంచులో కారులోనే ...

అసలు విషయంలోకెళ్లితే...ముంబైలోని గోరేగావ్‌కు చెందిన ఖలీలుల్లా అయానుల్లా ఖాన్‌ పోలీస్ కంట్రోల్ రూమ్‌కి కాల్ చేసి తనను తాను అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ (సీపీ) విజయ్ సింగ్‌గా పరిచయం చేసుకున్నాడు. ఈ మేరకు అయానుల్లా ఖాన్‌పింప్రీ చించ్‌వాడ్ పోలీస్ చీఫ్ నంబర్‌ ఇవ్వవల్సిందిగా అభ్యర్థించాడు. ఆ తర్వాత కాసేపటికి అయానుల్లా ఖాన్‌ తానే మళ్లీ కంట్రోలో రూమ్‌కి ఫోన్‌ చేసి ఆయనని కలవలేకపోయాను అందువల్ల క్రైమ్ బ్రాంచ్‌లోని ఇతర పోలీసు నెంబర్లను ఇవ్వండి అని కోరాడు.

ఈ క్రమంలో అయానుల్లా ఖాన్‌ ఒక పోలీసు అధికారికి ఫోన్‌ చేసి టౌన్‌షిప్ ప్రాంతంలో సుమారు 5 నుంచి 6 వరకు పిస్టల్స్ డెలివరీ అయ్యే అవకాశం ఉందంటూ అక్రమ ఆయుధాలకు సంబంధించిన సమాచారాన్ని అందించాడు. అంతేకాదు వాట్సాప్‌లో కొంతమంది వ్యక్తుల ఫోటోలను కూడా పంపించాడు. ఈ మేరకు పూర్తి సమాచారం కొరకు అయానుల్లా ఖాన్‌ పోలీసులను రూ 15, 000 కూడా డిమాండ్‌ చేశాడు. అయితే పోలీసులు కూడా అంగీకరించి డబ్బులు పంపించారు. ఈ క్రమంలో కొంత మంది పోలీసులకు అయానుల్లా ఖాన్‌ తీరు పై అనుమానం వచ్చి విచారించడం మొదలు పెట్టారు. ఈ మేరకు అయానుల్లా ఖాన్‌ పోలీస్ కమిషనర్‌ పేరుతో మోసం చేసినట్ల గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు.

(చదవండి:  రాజహంసలు ఒకేచోట సందడి చేశాయి: క్యూట్‌ వైరల్‌ వీడియో!!)

మరిన్ని వార్తలు