ఆమెలాగా అతగాడి పరిచయం.. అశ్లీల వీడియోలను పంపించాలని..

31 Aug, 2021 21:08 IST|Sakshi

లక్నో: ప్రస్తుత స్మార్ట్‌ యుగంలో ప్రతి ఒక్కరు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఈ క్రమంలో  చాలా మంది తమకు తెలియని వారితో  ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాలో చాటింగ్‌ చేస్తున్నారు. ఆ తర్వాత స్నేహం పేరుతో తమ నంబర్లను మార్చుకుంటున్నారు. కొత్తలో బాగా ఉన్నా.. ఆతర్వాత కొందరు మోసగాళ్ల బారినపడి బ్లాక్‌ మెయిలింగ్‌కు గురౌతున్నారు.  ప్రస్తుతం ఇలాంటి సంఘటనలు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి.

ఇలాంటి సంఘటన తాజాగా.. ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. యూపీకి చెందిన 23 ఏళ్ల యువకుడు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాలలో అనేక నకిలీ ప్రొఫైల్స్‌ను క్రియేట్‌ చేశాడు.  ఆ తర్వాత అనేక మంది యువతులకు రిక్వెస్ట్‌ పేట్టేవాడు. తాను ఒక ఎన్‌ఆర్‌ఐకు చెందిన యువతి అని, కెనడాలో ఉంటానని చెప్పుకునే వాడు. అతగాడి మెసెజ్‌కు రిప్లై ఇచ్చిన వారితో కొన్నిరోజులు చాటింగ్‌ చేసేవాడు.

ఆ తర్వాత అవతలి అమ్మాయికి తన నకిలీ అశ్లీల ఫోటోలు, వీడియోలు పంపేవాడు. అంతటితో ఆగకుండా నువ్వుకూడా నీ న్యూడ్‌ ఫోటోలు, వీడియోలను పంపాలని కోరేవాడు. ఈ క్రమంలో అతగాడి మాయలో పడిన కొందరు వారి ఫోటోలు పంపగానే తన అసలు రంగును బయటపేట్టేవాడు. వారిని డబ్బులు ఇవ్వాలని బ్లాక్‌ మెయిలింగ్‌కు పాల్పడేవాడు. అడిగినంతా డబ్బు ఇవ్వకపోతే ఫోటోలను,  వీడియోలను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తానని బెదిరించేవాడు.

ఈ క్రమంలో ఆ దుర్మార్గుడికి 15 ఏళ్ల బాలిక ఇన్‌స్టాలో పరిచయం అయ్యింది. ఆమెను ఇలాగే వేధింపులకు పాల్పడ్డాడు. అయితే, సదరు యువతి తన తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది. వారు వెంటనే యూపీలోని స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  ఈ మేరకు కేసు నమోదు చేసుకొని.. సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.   

చదవండి: మైనర్‌ బాలికకు మాయమాటలు చెప్పి.. ఐదుగురు కలిసి ఇంట్లో బంధించి..

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు