తెలుగు సినీ నటి ఫొటోలను అశ్లీలంగా మార్ఫింగ్‌ చేసి.. సోషల్‌ మీడియాలో..

8 May, 2022 16:52 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఓ నటిని వాట్సాప్‌ ద్వారా వేధిస్తున్న పోకిరీకి అరదండాలు పడ్డాయి. స్టార్‌ మేకర్స్‌ యాప్‌ ద్వారా నటి ఫోన్‌ నంబరు తీసుకున్న ఆకతాయి నటి ఫొటోలను అశ్లీలంగా మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానంటూ బెదిరించాడు.

పలుమార్లు అసభ్యకరంగా దూషించాడు. దీంతో భయపడిపోయిన నటి షూటింగ్‌లకు కూడా వెళ్లలేదు. ఆఖరికి సైబరాబాద్‌ షీ టీమ్‌కు వాట్సాప్‌ ద్వారా ఫిర్యాదు చేసింది. దీంతో మాదాపూర్‌ షీ టీమ్‌ రంగంలోకి దిగి నిందితుడిని పట్టుకొని రాయదుర్గం పీఎస్‌లో కేసు నమోదు చేసి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు.  

చదవండి: (Hyderabad: స్పా ముసుగులో వ్యభిచారం.. పరారీలో ఇషిక)

మరిన్ని వార్తలు