వీడు దేశముదురు.. యూట్యూబ్ వీడియోలు చూసి ఏకంగా వాటినే తయారు చేశాడు

13 Nov, 2021 23:51 IST|Sakshi

దశాబ్ద కాలం క్రితం ఏమైనా తెలుసుకోవాలంటే పక్కన వాళ్ళని ,లేదా నిపుణులనో అడిగేవాళ్ళం. కానీ ఎప్పుడైతే గూగుల్, యూట్యూబ్ లాంటివి వచ్చాయో అప్పటి నుంచి ఏది కావాలన్న వాటిలోనే దొరుకుతున్నాయి.అది మంచికైనా, చెడుకైనా అయితే..ఇటీవల కొందరు యూట్యూబ్‌ను మంచికే కాకుండా చెడుకి కూడా ఉపయోగిస్తున్నారు.ఓ వ్య‌క్తి అయితే యూట్యూబ్ వీడియోలు చూసి ఏకంగా డ్ర‌గ్ ల్యాబ్‌నే ఏర్పాటు చేసుకున్నాడు.అది కూడా నిషేధిత డ్ర‌గ్ ను త‌యారు చేసి అడ్డంగా బుక్క‌య్యాడు. ఈ ఘ‌ట‌న గుజ‌రాత్‌లోని సూర‌త్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే..
జైమిన్ సావ‌ని.. సరదాగా డ్ర‌గ్స్‌ మొదలు పెట్టి వాటికి బానిసలా మారాడు. డ్రగ్స్ కి పెద్ద మొత్తంలో డబ్బులు కావాలి గనుక త‌నే డ్రగ్స్ నీ త‌యారు చేయాలనుకున్నాడు.  యూట్యూబ్‌లో డ్ర‌గ్స్ త‌యారు చేసే వీడియోలు చూశాడు. వెంట‌నే సూర‌త్‌లోని స‌ర్థానా అనే ప్రాంతంలో ల్యాబొరేట‌రీని ఏర్పాటు చేశాడు. అక్క‌డ డ్ర‌గ్స్ త‌యారు చేయ‌డం ప్రారంభించాడు.రాజ‌స్థాన్‌కు చెందిన త‌న ఫ్రెండ్ ప్ర‌వీణ్ బిష్ణోయ్.. ఇటీవ‌ల‌ సూర‌త్‌కు వ‌చ్చాడు. త‌న వెంట 58 గ్రాముల నిషేధిత మెత్ డ్ర‌గ్‌ను తీసుకొచ్చాడు. దాని విలువ సుమారు 6 ల‌క్ష‌లు. దాన్ని సావ‌నికి అందించేందుకు వచ్చాడు.కాకపోతే అక్కడ పోలీసులు ప్ర‌వీణ్‌ను అరెస్ట్ చేసి కూపీ లాగ‌డంతో సావ‌ని బండారం మొత్తం బ‌య‌ట‌ప‌డింది.వెంట‌నే సావ‌ని ల్యాబ్‌కు చేరుకున్న పోలీసులు.. డ్ర‌గ్స్ త‌యారు చేయ‌డం కోసం ఉప‌యోగించే వ‌స్తువుల‌ను సీజ్ చేసి అతన్ని అరెస్ట్ చేశారు.యూట్యూబ్‌లో వీడియోలు చూడ‌టంతో పాటు.. రాజస్థాన్‌కు చెందిన డ్ర‌గ్ డీల‌ర్ల ద‌గ్గ‌ర డ్ర‌గ్స్ త‌యారీని నేర్చుకున్నట్లు పోలీసు విచారంలో నిజాలను బయట పెట్టాడు.
చదవండి: Maharashtra: మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ.. 26 మంది మృతి

మరిన్ని వార్తలు