వ్యాక్సిన్‌ సెంటర్లో పోలీసుల ఓవర్‌ యాక్షన్‌, యువకుడి ఆత్మహత్య 

27 Jul, 2021 15:25 IST|Sakshi

 వ్యాక్సీన్‌ కేంద్రంలోకి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు, వివాదం

అవమానం భరించలేక యువకుడి ఆత్మహత్య

అయిదుగురు పోలీసులపై  కేసు నమోదు

పది మంది పోలీసులు  సస్పెన్షన్‌

లక్నో: వ్యాక్సిన్‌ సెంటర్‌లో వివాదం విషాదాన్ని నింపింది. పోలీసులు తనను అవమానించి, దాడి చేశారనే  క్షణికావేశంలో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్‌, బాగ్‌పట్ జిల్లాలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. ఈ ఘటనలో అయిదుగురు పోలీసులపై  కేసు నమోదైంది.

బాధితుల స​మాచారం ప్రకారం పశ్చిమ యూపీ జిల్లాలోని ఒక టీకా కేంద్రంలో పోలీసుల ఓవర్‌ యాక్షన్‌ వివాదానికి తెర తీసింది. ఎలాంటి కారణంగా లేకుండానే టీకా కేంద్రంలోకి వెళ్లనీకుండా బాధిత యువకుడిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వివాదం మొదలైంది. మెడికల్‌ సిబ్బంది  వ్యాక్సీన్‌ తీసుకునేందుకు అతని పేరు పిలిచినా  లోనికి వెళ్లనీయకుండా  అడ్డుపడి,  అతనిపై  దాడి చేసి కొట్టారు.  సోమవారం మధ్యాహ్నం బాగ్‌పట్‌లోని టీకా కేంద్రంలో  జరిగిన ఈ  ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో  వైరల్‌ అయింది.

దీనికి తోడు సంఘటన అనంతరం పోలీసులు ఇంటికి వెళ్లి మళ్లీ ఆ యువకుడిపై దాడి చేశారు. అడ్డొచ్చిన బాధితయువకుడి తల్లిపై కూడా దాడి చేశారు. దీంతో ఈ అవమానాన్ని తట్టుకోలేని యువకుడు గ్రామానికి సమీపంలో చెట్టుకు ఉరేసుకుని ఉసురు తీసుకున్నాడు. 

పోలీసులు తన కొడుకును టీకా కేంద్రంలోకి అనుమతించకపోవడంతో ఘర్షణ మొదలైందని బాధితుడి తండ్రి ఆరోపించారు. పోలీసులు తన కొడుకును చుట్టుముట్టి, దారుణంగా కొట్టారని, ఆ తరువాత ఇంటికి వచ్చి తనపై భార్యపై కూడా దాడి చేశారని వాపోయాడు. దీంతో భయపడి తన కొడుకు పారిపోయి చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడని కన్నీంటి పర్యంతమయ్యాడు. మరోవైపు బాధితుల ఫిర్యాదు మేరకు పదిమంది పోలీసులను విధులనుంచి తొలగించామనీ, బాగ్‌పట్ పోలీసు అధికారి అభిషేక్ సింగ్ తెలిపారు. కేసు దర్యాప్తు జరుగుతోందని, విచారణ అనంతరం  దోషులపై కఠినచర్యలు తీసుకుంటామని, రు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు