కుక్కను అత్యంత దారుణంగా కొట్టి చంపిన యజమాని

5 Aug, 2021 21:14 IST|Sakshi
బోన్జో

లండన్‌ : పెంపుడు కుక్కను దారుణంగా కొట్టి చంపిన వ్యక్తికి 4 నెలల జైలు శిక్ష విధించింది బ్లాక్‌పూల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు. గురువారం ఈ కేసుపై కోర్టు విచారణ జరిపింది. కుక్కను అంత దారుణంగా కొట్టి చంపటం తానెప్పుడూ చూడలేదని ఆర్‌ఎస్‌సీపీఏ ఇన్‌స్పెక్టర్‌ కోర్టుకు తెలిపారు. కుక్కపై దాడి అత్యంత దారుణమైనదని మెజిస్ట్రేట్‌ అభిప్రాయపడ్డారు. ఇద్దరూ 10 ఏళ్ల పాటు జంతువుల్ని పెంచుకోకుండా తీర్పునిచ్చారు. ఆమె భార్యను కూడా కోర్టు నేరస్తురాలిగా తేల్చినప్పటికి జైలు శిక్షపడకుండా తప్పించుకుంది. 

నికోల్‌ లోగాన్‌, ఆండ్రూ మాకే

కేసు వివరాలు.. ఇంగ్లాండ్‌లోని పుల్టన్‌ లీ ఫిల్డేకు చెందిన ఆండ్రూ మాకే(30), నికోల్‌ లోగాన్‌(27) భార్యాభర్తలు. వీరు బోన్జో అనే క్రాస్‌బ్రీడ్‌ కుక్కను పెంచుకుంటున్నారు. 2019, డిసెంబర్‌ 23న ఆండ్రూ తన కుక్కను తీసుకుని గార్‌స్టాంగ్‌లోని వెటర్నిటీ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కుక్క శరీరంపై 18 రాళ్లు పడ్డాయని వెటర్నరీ డాక్టర్‌కు అబద్దం చెప్పాడు. అయితే, ఆండ్రూ అబద్దం ఆడుతున్నాడని, ఆ కుక్క దెబ్బల కారణంగా చనిపోయిందని ఆ డాక్టర్‌ అనుమానించాడు. ఆ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు ఆండ్రూను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆండ్రూ కుక్కను దారుణంగా కొట్టి చంపాడని తేలింది. కుక్కకు వైద్య పరీక్షలు నిర్వహించగా దాదాపు 25 ప్రక్కటెముకలు విరిగినట్లు గుర్తించారు.

మరిన్ని వార్తలు