భక్తి ముసుగులో హత్యలు

23 Apr, 2021 06:45 IST|Sakshi
హతమైన చేపూరి భాగ్యవతి, బద్రి సత్యవతి, ఆకుల నాగమణి

ఐదుగురిని చంపేసిన క్రూరుడు

ఒకరి హత్య కేసులో రుజువుతో జీవిత ఖైదు

మామిడికుదురు (తూర్పుగోదావరి): భక్తి ముసుగులో నేరాలు చేయడం అతని నైజం. దుర్గమ్మ కథ పేరుతో అమాయక మహిళలకు వల వేయడం వెన్నతో పెట్టిన విద్య. ఈ మోసపు వైఖరితో ఐదుగురు మహిళల జీవితాలను నాశనం చేశాడీ కరడు గట్టిన నేరస్తుడు. కపిలేశ్వరపురం మండలం కేదారిలంకకు చెందిన సలాది లక్ష్మీనారాయణ  గ్రామాల్లో వెంకన్నబాబు, కనకదుర్గమ్మ కథలు చెబుతూ మహిళలను లోబరచుకునేవాడు. మాయమాటలు చెప్పి, జనసంచారం లేని ప్రాంతాలకు తీసుకు వెళ్లేవాడు. వారిపై లైంగిక దాడికి పాల్పడేవాడు. తర్వాత వారిని అతి క్రూరంగా హతమార్చి, వారి ఒంటిపై ఉన్న బంగారం దోచుకునేవాడు.

అంతటితో కథ ముగిసిపోలేదు. మహిళల శవాలు కనిపించకుండా ఇసుక తిన్నెల్లో పూడ్చి పెట్టేవాడు. గతంలో ఈ నిందితుడిని పోలీసులు రిమాండుకు తరలిస్తుండగా వారి కళ్లు గప్పి తప్పించుకుని మళ్లీ చిక్కాడు. ఐదు నేరాలకు గాను నగరం స్టేషన్‌లో నమోదైన భాగ్యవతి హత్య కేసులో లక్ష్మీనారాయణకు గురువారం జీవిత ఖైదు పడింది. అమలాపురం రెండో అదనపు జిల్లా జడ్జి సీఎస్‌ మూర్తి ఈ మేరకు తీర్పు చెప్పారు. ఇన్నాళ్లకు తమకు తగిన న్యాయం జరిగిందని బాధిత కుటుంబాలు ఆనందం వ్యక్తం చేశాయి.

ఇవీ సంఘటనలు 
2012 మే నెలలో కొవ్వూరు రూరల్‌ మండలం మద్దూరిలంకకు చెందిన ఆకుల నాగమణిని చంపేశాడు.
2014లో యానాంకు చెందిన సత్యవతిని కూడా చంపి పాతిపెట్టేశాడు.
2014లో దంగేరుకు చెందిన ఒక వివాహితను దారుణంగా హత్య చేశాడు.
2015లో మలికిపురం మండలం కేశనపల్లి గ్రామానికి చెందిన బద్రి సత్యవతి అలియాస్‌ బుజ్జి ప్రాణాలు తీశాడు.
2017 జనవరిలో నగరం పోలీస్‌ స్టేషన్‌లో మామిడికుదురుకు చెందిన చేవూరి భాగ్యవతిని హతమార్చాడు.
చదవండి:
ఫోన్‌ మాట్లాడొద్దన్న మామ, భవనంపై నుంచి దూకిన యువతి 
గట్టిగా కేకలు వేయడంతో గుట్టుచప్పుడు కాకుండా..

మరిన్ని వార్తలు