సర్వీస్‌ సెంటర్‌ ముందు వ్యక్తి ఆత్మాహుతి

14 Nov, 2020 11:30 IST|Sakshi
సంఘటనా స్థలం వద్ద పోలీసులు

న్యూఢిల్లీ : పాడై పోయిన ఫోన్‌ను రీప్లేస్‌ చేయనన్నారనే ఆవేదనతో సెల్‌ఫోన్‌ సర్వీస్‌ సెంటర్‌ ముందు ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడో వ్యక్తి. ఈ సంఘటన ఢిల్లీలోని రోహినిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రహ్లాద్‌పూర్‌ గ్రామానికి చెందిన భీమ్‌ సింగ్‌ అనే వ్యక్తి కొద్దిరోజుల క్రితం ఓ సెల్‌ఫోన్‌ కొన్నాడు. వారం రోజుల తర్వాతినుంచి అది పనిచేయటం మానేసింది. దీంతో భీమ్‌ నవంబర్‌ 6వ తేదీన సెల్‌ఫోన్‌ సర్వీస్‌ సెంటర్‌ వద్దకు వెళ్లాడు. అయితే వారు సెల్‌ఫోన్‌ను రీప్లేస్‌ చేయటం కుదరదని చెప్పారు.( పండుగ వేళ విషాదం )

మరికొన్నిసార్లు సర్వీస్‌ సెంటర్‌ చుట్టూ తిరిగినా లాభం లేకపోయింది. ఈ నేపథ్యంలో శుక్రవారం షాపు ముందు ఒంటికి నిప్పంటించుకున్నాడు. మంటల్లో తీవ్రగాయాలపాలైన అతడ్ని ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సెల్‌ఫోన్‌ తరచుగా హీటెక్కేదని, ఉన్నట్టుండి బ్యాటరీ పేలి పోయిందని బాధితుడి భార్య పూనమ్‌ పోలీసులకు తెలిపింది.

మరిన్ని వార్తలు