లోన్‌ ఇవ్వలేదని.. బ్యాంకునే తగలబెట్టాడు!

11 Jan, 2022 09:05 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: బ్యాంకుల్లో లోన్‌ లభించడం అంత సామన్యమైన విషయం కాదు! ఇల్లు, పొలానికి సంబంధించిన ఒరిజినల్‌ డాక్యుమెంట్లు ఉండాలి. కొన్నిసార్లు అన్ని డాక్యుమెంట్లు సరిగా ఉన్నా బ్యాంకు చుట్టూ ప్రదక్షిణలు తప్పవు. బ్యాంకు ఆఫిసర్లు పెట్టే కండిషన్లు సామాన్యులకు తీవ్రమైన అసహనానికి గురిచేస్తుంటాయి. అయితే తాజాగా ఓ వ్యక్తి తన లోన్‌ అప్లికేషన్‌ను తిరస్కరించిన బ్యాంక్‌ను పెట్రోల్‌ పోసి తగలబెట్టాడు. కర్ణాటకలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిది. వివరాల్లోకి వెళితే.. వసీమ్‌ అనే వ్యక్తి బైక్‌ మీద హవేరి జిల్లా బైడగి తాలూకా సమీపంలోని హెడిగొండ గ్రామానికి వచ్చాడు.

చదవండి: అశ్లీల వీడియోల పేరుతో బ్లాక్‌మెయిల్‌ కేసు: వెలుగులోకి కొత్తపేరు

ఆ గ్రామంలో ఉ‍న్న బ్యాంక్‌ కిటికీలో నుంచి పెట్రోల్‌ పోసి నిప్పు అంటించారు. బ్యాంక్‌లో మంటలు చెలరేగాయి. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పారు. అయితే ఈ ఘటనను గమనించిన గ్రామస్తులు అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతనిపై కేసు నమోదు చేసిన విచారించగా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

సదరు బ్యాంక్‌ వద్ద తాను లోక్‌ దరఖాస్తు చేసుకున్నానని తెలిపాడు. అయితే తన లోన్‌ దరఖాస్తును బ్యాంక్‌ తిరస్కరించదని, ఆ కోపంతో బ్యాంక్‌ను పెట్రోల్‌తో తగలబెట్టానని పోలీసులకు తెలిపాడు. అయితే ఈ ఘటన వెనక బ్యాంక్‌ అంతర్గత సిబ్బంది ప్రమేయం ఉందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులోని కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు ధ్వసం అయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తిగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు