మరదలిని ఆరేళ్లుగా వేధిస్తున్న బావ.. దీంతో.. 

4 May, 2021 11:54 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని పదిర, రాచర్ల, గొల్లపల్లి గ్రామాలకు చెందిన ఇద్దరు వివాహిత మహిళలను మానసికంగా వేధిస్తున్న ముగ్గురిపై ఆదివారం రాత్రి  వేర్వేరుగా కేసులు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. తన సొంత అక్క భర్త వేధిస్తున్నాడని వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన ఒక వివాహిత ఫిర్యాదు మేరకు కోనరావుపేట మండలం నిమ్మపల్లికి చెందిన చీకటి శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

తనను పెళ్లి చేసుకోవాలని లేకుంటే చనిపోతానంటూ ఆరేళ్లుగా  వేధిస్తున్నాడని, పుట్టింట్లో ఉండగా చేయి పట్టుకున్నట్లు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అలాగే గొల్లపల్లి గ్రామానికి చెందిన ముద్రకోళ్ల వంశీ అనే వ్యక్తి సహాయంతో కామారెడ్డి జిల్లా లింగంపేట గ్రామానికి చెందిన పూసల శేఖర్‌ మూడేళ్లుగా ఫోన్‌ చేస్తూ వేధిస్తున్నట్లు ఒక వివాహిత ఫిర్యాదు మేరకు వారిద్దరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు