దారుణం: కావలసినంత కట్నం తేలేదని కాల్పులు

2 Jun, 2021 12:26 IST|Sakshi

ఘజియాబాద్: సమాజంలో వరకట్నమనేది సామాజిక దురాచారం. దీని వలన స్త్రీలపై ఊహకందని రీతిలో చిత్రహింసలు, నేరాలు జరుగుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తగినంత కట్నం తీసుకురాలేదని 24 ఏళ్ల భార్యను ఆమె భర్త కాల్చి చంపిన దారుణ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ముజఫర్ నగర్ జిల్లాలోని బుధానా తహసీల్‌ ఉపవాలి గ్రామానికి చెందిన సారికా (24)కు కుల్దీప్ అలియాస్ మింటూతో గత ఏడాది ఫిబ్రవరిలో వివాహం జరిగింది. వివాహం అనంతరం ఎక్కువ కట్నం ఇవ్వలేదని భార్య సారికాను కుల్దీప్ నిత్యం వేధించేవాడు.

ఈ క్రమంలో జూన్‌ 1న కుల్దీప్ తన భార్య సారికతో రూ.50 లక్షల కట్నం తీసుకురాలేదని గొడవకు దిగాడు. ఆ సమయంలో అతడు తుపాకీ తీసి భార్యపై మూడు సార్లు కాల్పులు జరిపాడు. బుల్లెట్‌ గాయాలతో సారిక అక్కడికక్కడే మరణించింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకుని, రక్తపు మడుగులో పడి ఉన్న సారిక మృతదేహాన్ని పోస్టుమాస్టం తరలించినట్టు పోలీసులు పేర్కొన్నారు . బార్యను హత్య చేసిన తర్వాత కుల్దీప్, అతని తండ్రి మూల్చంద్ ఇంట్లో నుంచి పారిపోయినట్టు తెలిపారు. పరారీలో ఉన్న తండ్రి, కొడుకును అరెస్టు చేయడానికి పోలీసు బృందాలను పంపినట్టు వెల్లడించారు. కాగా నిందితుడు కుల్దీప్ గతంలో ఓ వ్యాపారవేత్త హత్య కేసులో జైలు శిక్ష అనుభవించినట్టు పోలీసులు పేర్కొన్నారు.

(చదవండి: Viral: నేను పులిరాజును.. అయితే నాకేంటి!)

మరిన్ని వార్తలు