ఏటీఎం కార్డుతో దోచేశారు

10 Aug, 2020 08:57 IST|Sakshi

పోలీసులను ఆశ్రయించిన బాధితులు  

ఏలూరు టౌన్ (పశ్చిమగోదావరి) ‌: ఒక వ్యక్తి బ్యాంకు ఖాతాలో నగదు ఏటీఎం కార్డుతో స్మార్ట్‌గా దోచేశాడో అగంతకుడు. బ్యాంకు ఖాతాలోని డబ్బు ఏకంగా రూ.11.91 లక్షలు కాజేయటంతో బాధితులు లబోదిబోమంటున్నారు. తమ సొమ్ము భారీగా మాయం అయ్యిందంటూ బాధితులు ఏలూరు త్రీటౌన్‌ పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి కుమారుడు గుమ్మళ్ళ రాజేష్‌ ఫిర్యాదు మేరకు త్రీటౌన్‌ సీఐ మూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు త్రీటౌన్‌ పరిధిలోని విద్యానగర్‌కు చెందిన గుమ్మళ్ళ రాజేష్‌ తండ్రి ఒక ప్రభుత్వ ఉద్యోగి.

ఆయన ఇటీవల మృతిచెందటంతో ఆయనకు ప్రభుత్వ పరంగా రావాల్సిన సొమ్ములు వచ్చాయి. తండ్రి రాయితీ డబ్బులు తల్లి బ్యాంకు అక్కౌంట్‌లో జమ అయ్యాయి. ఈ సొమ్మును బ్యాంకు నుంచి విత్‌డ్రా చేసుకునేందుకు ఈనెల 7న రాజేష్‌ తన తల్లిని తీసుకుని బ్యాంకుకు వెళ్లాడు. డబ్బులు తీసుకునేందుకు ప్రయతి్నంచగా అప్పటికే ఆమె ఖాతాలోని నగదు డ్రా చేసినట్లు ఉందని బ్యాంకు సిబ్బంది తెలిపారు. జూన్‌ నెల నుంచీ ఏటీఎం ద్వారా 28సార్లు నగదును ఎవరో డ్రా చేసినట్లు తెలిపారు. బాధితులు చేసేది లేక ఏలూరు త్రీటౌన్‌ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు