ఆమెను చంపాలనుకోలేదు.. కల కన్నాను

20 Jan, 2021 10:44 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లండన్‌ : తాగుబోతు ప్రియుడు.. ప్రియురాలిపై హత్యాయత్నానికి ప్రయత్నించిన 2019న నాటి కేసుకు సంబంధించి ఇంగ్లాండ్‌లోని డెర్బీ క్రౌన్‌ కోర్టు తాజాగా విచారణ చేపట్టింది. నిందితుడు, బాధితురాలి వాదనలను కోర్టు విన్నది. ప్రియురాలు జాక్సన్‌పై తాను ఉద్ధేశ్యపూర్వకంగా హత్యా ప్రయత్నం చేయలేదని, కలకంటూ ఆమె గొంతునులిమానని నిందితుడు డెర్బీ నగరానికి చెందిన 31 ఏళ్ల బ్రాడ్లే సౌతో కోర్టుకు విన్నవించాడు. నిందితుడు మాట్లాడుతూ.. ‘‘ నేను అప్పుడు కలకంటున్నాను. ఫైటింగ్‌ రింగులో ఉండి ఓ వ్యక్తితో తలపడుతున్నాను. ఆ వ్యక్తి గొంతు నులుముతున్నాను. ఆ వెంటనే నేను కలలోంచి బయటపడి జాక్సన్‌(ప్రియురాలు) శ్వాస తీసుకోవటం కోసం ఇబ్బంది పడటం గుర్తించాను. దేవుడా! ఆమెకు ఏమీ కాకూడదు అనుకున్నా.. ఆ వెంటనే బెడ్‌ మీదనుంచి పైకి లేచి గదిలోని లైటు వేశాను.( విద్యార్థినులను వేధించిన టీచర్‌కు 49 ఏళ్ల జైలు)

అంతే! నా గుండె ఒక్కసారిగా ఆగినట్లయింది. జాక్సన్‌ కదలికలేకుండాపడి ఉంది. మా అమ్మకు ఫోన్‌ చేసి విషయం చెప్పాను. అంబులెన్స్‌కు ఫోన్‌ చేయమని ఆమె నాకు చెప్పింది. చేశాను. అంబులెన్స్‌ వచ్చి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లింది. జాక్సన్‌ క్షేమంగా బయటపడింది’’ అని తెలిపాడు. దీనిపై బాధితురాలు జాక్సన్‌ మాట్లాడుతూ.. ‘‘ అతడు నా గొంతు చుట్టూ తన చేతిని బిగించాడు. చాలా బలంగా .. ఊపిరి పీల్చుకోవటనానికి ఇబ్బందిపడ్డాను. చచ్చిపోతానేమోనని భయపడ్డాను. పిల్లల్ని ఒంటరిగా వదిలేసి వెళతానేమోనని బాధేసింది. అతడు నన్ను చంపటానికి ప్రయత్నించటం నమ్మలేకపోయాను’’ అని అంది. కాగా, ఇద్దరి వాదనలను విన్న కోర్టు విచారణను వాయిదా వేసింది. 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు