మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని..

24 Jul, 2021 08:12 IST|Sakshi

తల్లితో గొడవపడి కొడుకు ఆత్మహత్య 

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని తల్లితో గొడవపడిన ఓ కొడుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగిరెడ్డిపేట గ్రామానికి చెందిన చెవిబోయిన భాగ్యకు ఇద్దరు సంతానం.. కూతురు స్వప్న, కొడుకు ప్రసాద్‌(20). కాగా, ఆమె భర్త గతంలోనే చనిపోవడంతో జీవనోపాధి నిమిత్తం హైదరబాద్‌కు వెళ్లారు. అక్కడ ప్రసాద్‌ గత కొంతకాలంగా మద్యంతాగుతూ ఏ పని చేయకుండా తిరుగుతూ ఉండేవాడు.

మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వకపోతే తాను ఆత్మహాత్య చేసుకుంటానని తరుచూ తన తల్లిని బెదిరించేవాడు. ఈక్రమంలో 21న మద్యం కోసం తల్లితో గోడవపడి తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి నాగిరెడ్డిపేటకు చేరుకున్నాడు. మరుసటిరోజు రాత్రి వరకు ప్రసాద్‌ తన ఇంటి తలుపులు తెరవకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్సై ఆంజనేయులు ఘటన స్థలానికి చేరుకొని తలుపులను పాక్షికంగా ధ్వంసంచేసి చూడగా ప్రసాద్‌ ఇంట్లో దులానికి ఉరేసుకొని ఉన్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు