అరెస్ట్‌ భయంతో ఆత్మహత్యాయత్నం

27 Jun, 2022 07:28 IST|Sakshi

మైసూరు: హత్య కేసులో అరెస్ట్‌ భయంతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మైసూరు జిల్లా నంజనగూడు తాలూకా హుల్లమళ్లి పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు...ఈ నెల 14న హుళ్లహళ్లి సమీపంలోని ఓ బార్‌ వద్ద తీవ్ర గాయాలైన వనరనాయక్‌ అనే వ్యక్తిని పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతను కేఆర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 20న మృతి చెందాడు. హత్య కేసు నమోదు చేసిన పోలీసులకు మహాదేవనాయక్‌పై అనుమానం ఏర్పడింది. తనను అరెస్ట్‌ చేస్తారేమోనన్న భయంతో మహాదేవనాయక్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి ఆస్పత్రికి తరలించారు.

ప్రేమికుడి ఆత్మహత్య 
యశవంతపుర: తాను ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందంటూ యువకుడు వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్న ఘటన హాసన్‌లో జరిగింది. దిలీప్‌ కుటుంబం బెంగళూరులో నివాసం ఉంటోంది. అక్కడే ఓ గార్మెంట్స్‌లో పనిచేస్తున్న శివమొగ్గ జిల్లా సొరబ తాలూకాకు చెందిన అమ్మాయిని ప్రేమించాడు. అయితే ఇటీవల అమ్మాయి అతనికి దూరంగా ఉంది. దీంతో జీవితంపై విరక్తి కలిగిన దిలీప్, సదరు ప్రేమికురాలి గ్రామానికి సమీపంలోని కొండపైకి వెళ్లి ఉరి వేసుకున్నాడు. అంతకు ముందు  నాలుగేళ్ల పాటు తనను ప్రేమించి మోసం చేసిందని చెబుతూ వీడియో తీశాడు. స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

(చదవండి: యువతి మాయలో బ్యాంక్‌ మేనేజర్‌.. రూ. 5.70 కోట్లు బదిలీ!)

మరిన్ని వార్తలు