కోడలి ఆత్మహత్యతో మామ బలవన్మరణం 

24 Oct, 2020 08:06 IST|Sakshi

కోడలి అంత్యక్రియలు ముగిసిన 10గంటల్లోనే ఉరేసుకుని ఆత్మహత్య 

అవమాన భారంతోనే..! 

సాక్షి, భాకరాపేట: ఆ ఇంట మళ్లీ పెనువిషాదం అలుముకుంది. కోడలు అంత్యక్రియలు ముగిసిన పది గంటల వ్యవధిలోనే ఓ మామ తానూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చిన్నగొట్టిగల్లు మండలం బోడిరెడ్డిగారి పల్లెలో చోటుచేసుకుంది. భాకరాపేట ఎస్‌ఐ రవినాయక్‌ కథనం..బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న చిన్నగొట్టిగల్లు మండలం బోడిరెడ్డిగారిపల్లెకు చెందిన ఆనందరెడ్డికి ఇదే గ్రామానికి చెందిన హరితతో 4 నెలల క్రితం వివాహమైంది. ఆమె అరగొండ అపోలో హాస్పిటల్‌లో నర్సింగ్‌ లెక్చరర్‌గా పనిచేస్తోంది.   (అనుమానించి ఉద్యోగం మాన్పించాడు.. చివరకు!)

ఆనందరెడ్డి వేధింపులు తాళలేక గురువారం హరిత ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం విదితమే. అప్పటికే ఆమె మూడు నెలల గర్భిణి కూడా. ఇదేరోజు పోస్టుమార్టం అనంతరం రాత్రి 9 గంటలకు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో, శుక్రవారం తెల్లవారిజామున పొలం వద్దకు వెళ్లి వస్తానంటూ వెళ్లిన హరిత మామ రామిరెడ్డి (67) ఎంతసేపటికీ తిరిగి రాలేదు.  (వరద నీటిలో తండ్రీకూతుళ్లు గల్లంతు)

దీంతో అక్కడికి వెళ్లి చూడగా మామిడితోటలో  చెట్టుకు డ్రిప్‌ పైపులతో ఉరేసుకుని విగతజీవిగా వేలాడుతున్న రామిరెడ్డిని  గుర్తించారు. కోడలి మరణంతో అవమాన భారం తట్టుకోలేక అతడు బలవన్మరణం చెందినట్టు ఎస్‌ఐ చెప్పారు. పీలేరులో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అప్పగించడంతో ఇదేరోజు రాత్రి అంత్యక్రియలు నిర్వహించారు. ఇంటి నుంచి అదృశ్యమైన ఆనందరెడ్డి జాడ లేకపోవడంతో రెండవ కొడుకు  తలకొరివి పెట్టాడు. 

మరిన్ని వార్తలు