ఆమె లేని జీవితం వద్దంటూ!

27 Oct, 2020 08:54 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, చంద్రగిరి: ప్రేమించిన యువతికి వివాహమైందని జీవితంపై విరక్తి చెంది ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం..మండలంలోని ఆముదాల కోనకు చెందిన మురళి, జానకి దంపతుల కుమారుడు సునీల్‌(20) గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. అయితే ఆ యువతికి వారం క్రితం వివాహం కావడంతో కుంగిపోయాడు. దీంతో అమ్మమ్మ ఊరైన తొండవాడకు వెళ్లాడు. తన స్నేహితుల వద్ద తన ప్రేమగాథను చెప్పుకుని బాధపడేవాడు.  (సైకో డాక్టర్‌.. భార్య కాపురానికి రాలేదని..)

ఈ నేపథ్యంలో బయటకు వెళ్లిన అతడు శనివారం రాత్రి అమ్మమ్మ ఇంటికి రాలేదు.  తొండవాడ సమీపంలోని ఓ ప్రైవేటు వెంచర్‌ వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండటం ఆదివారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. తిరుపతి ఎస్వీ మెడికల్‌ కాలేజీలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

కుటుంబ కలహాలతో వివాహిత..
పూతలపట్టు (చిత్తూరు రూరల్‌) : హెయిర్‌ ఆయిల్‌ తాగి ఓ మహిళ మృతి చెందిన ఘటన పూతలపట్టు మండలంలో చోటు చేసుకుంది. వివరాలు... మండలంలోని రంగంపేటకు చెందిన కుప్పమ్మ (34) కుటుంబ కలహాల కారణంగా మనస్తాపానికి గురై ఆదివారం ఇంట్లో ఉన్న హెయిర్‌ ఆయిల్‌ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పూతలపట్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   (ప్రేమ వివాహం.. భర్త హత్య)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు