వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఒత్తిడి తట్టుకోలేక..

22 Oct, 2020 13:56 IST|Sakshi

గాంధీనగర్‌ : వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఒత్తిడికి ఓ నిండు ప్రాణం బలైంది. ఈ సంఘటన గుజరాత్‌ రాష్ట్రంలో మంగళవారం చోటుచేసకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుజరాత్‌లోని అదాజన్‌కు చెందిన జిగర్‌ గాంధీ అనే వ్యక్తి నోయిడాలోని ఓ కంపెనీలో గత మూడు సంవత్సరాలుగా పని చేస్తున్నాడు. దాదాపు రెండు నెలల నుంచి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ద్వారా విధులు నిర్వహిస్తున్నాడు. పని ఒత్తిడి కారణంగా కొద్దిరోజులుగా ముభావంగా ఉంటున్నాడు. ఈ ఒత్తిడి గురించి కుటుంబసభ్యులతో కూడా చర్చించాడు. అయినా అతడిలో మార్పురాలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ( 9 మంది ప్రాణాలు తీసిన నూడిల్స్‌‌ )

దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటనపై అదాజన్‌ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘‘గత డిసెంబర్‌లో అతడి ఎంగేజ్‌మెంట్‌ రద్దయింది. ఇక అప్పటినుంచి డిప్రెషన్‌లో ఉన్నాడు. దానికి తోడు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఒత్తిడి కూడా మొదలైంది. అతడికి సన్నిహితంగా ఉండే ఇద్దరు వ్యక్తుల్ని ఆత్మహత్యకు ముందు రోజు ఇంటికి పిలిపించుకుని ఆ రాత్రంతా వారితో సరదాగా గడుపుదామనుకున్నాడు. కానీ, అలా జరగలేదు. అంతలోనే ఆత్మహత్య చేసుకున్నాడ’’ని తెలిపారు.

మరిన్ని వార్తలు