సెల్ఫీ వీడియో తీసుకుంటూ యువకుడి బలవన్మరణం 

21 Oct, 2021 15:50 IST|Sakshi

సాక్షి, జవహర్‌నగర్‌: సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. కార్పొరేషన్‌ పరిధిలోని వెంకటేశ్వరకాలనీలో నివసించే ఆటో మల్లేశం కుమారుడు అశోక్‌ (28) కొరియర్‌ బోయ్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం ఇంటికి వచి్చన అశోక్‌ సెల్ఫీ వీడియో తీసుకుంటూ ‘నేను నానమ్మ దగ్గరకు వెళ్తున్నాను.

ఇదే నా చివరి వీడియో. నేను నిజంగా ఉరి వేసుకుంటున్నా..’ అని చెబుతూ వీడియో తీసుకున్నాడు. ఆ వీడియో క్లిప్‌ను మిత్రుడికి పంపి ఉరి వేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు కారణాలు పూర్తిగా వెల్లడి కాలేదు. 
చదవండి: భర్త తనకు నచ్చినట్లు షర్ట్‌ కుట్టించుకోలేదని.. భార్య ఆత్మహత్య

మరిన్ని వార్తలు