పెళ్లి చేసుకో.. లేకపోతే ఫోటోలు, వీడియోలు బయటపెడతా..

4 May, 2022 16:51 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

రాయవరం(కోనసీమ జిల్లా): వివాహం చేసుకోవాలని, లేకుంటే చంపుతానని బెదిరిస్తున్నాడని ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఏఎస్‌ఐ పి.వెంకటేశ్వరరావు మంగళవారం తెలిపారు. వివరాలివి... రాయవరం గ్రామానికి చెందిన యువతికి మండలంలోని వి.సావరం గ్రామానికి చెందిన నీలం సూర్యప్రకాశ్‌తో గతంలో తల్లిదండ్రులు వివాహం నిశ్చయించారు.
చదవండి👉: వివాహేతర సంబంధం.. వ్యక్తికి ఘోరమైన శిక్ష

సూర్యప్రకాష్‌ ప్రవర్తన నచ్చకపోవడంతో యువతి అతనితో వివాహానికి నిరాకరించడంతో వివాహం రద్దు చేశారు. తనను వివాహం చేసుకోవాలంటూ సూర్యప్రకాష్‌ యువతిని తరచూ వేధింపులకు గురి చేస్తున్నాడు. ఏప్రిల్‌ 25న సూర్యప్రకాష్‌ యువతి ఇంటికి వెళ్లి వివాహం చేసుకోకుంటే తన వద్ద ఉన్న ఫొటోలు, వీడియోలు బయట పెడతానని, వివాహం చేయకుంటే చంపుతానంటూ అసభ్య పదజాలంతో యువతిని, ఆమె తల్లిని బెదిరించాడు. దీనిపై యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్‌ఐ తెలిపారు.

మరిన్ని వార్తలు