రన్నింగ్‌ బస్సును ఎక్కబోయిన వృద్ధుడు.. పట్టుతప్పి ప్రాణాలు..

12 Aug, 2021 20:58 IST|Sakshi

ముంబై: రన్నింగ్‌ బస్సును ఎక్కడానికి ప్రయత్నించి ఓ వృద్ధుడు ప్రమాదావశాత్తు అదే బస్సు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ  ఘటన బుధవారం మధ్యాహ్నం ముంబైలోని గోరేగావ్ బస్ డిపో సమీపంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకాం.. ముంబైలోని గోరేగావ్‌ సబ్బరన్‌ ప్రాంతంలో 55 ఏళ్ల వృద్ధుడు రోడ్డుపై వెళ్తున్న బస్సు ఎక్కడానికి ప్రయత్నించి ప్రమాదావశాత్తు అదే బస్సు కింద పడిసోయి ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. నిర్లక్ష్యంగా బస్సు నడిపిన డ్రైవర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

ఇక మృతుడు వసంత్‌ గోండు ఘోలేగా పోలీసులు గుర్తించారు. బస్సు వెనుక చక్రం కింద పడిపోయిన వృద్ధుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు.  సీసీటీవీ పుటేజీని సేకరించామని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. డ్రైవర్‌ను అరెస్టు చేసి, వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వాన్రాయ్‌ పోలీస్‌ స్టేషన్‌ సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ అనిల్‌ వాగ్‌మారే తెలిపారు. 
 

మరిన్ని వార్తలు