ఎట్టకేలకు బెజవాడ రాజశేఖర్‌ డెడ్‌బాడీ లభ్యం.. చంపింది ఎవరంటే?

4 Jun, 2022 13:24 IST|Sakshi

సాక్షి, నల్లగొండ: జిల్లాలో దారుణం జరిగింది. కట్టంగూరు మండలం రసూల్‌గూడెంలో రాజశేఖర్‌(27) నాలుగు రోజలు క్రితం కిడ్నాప్‌కు గురయ్యాడు. అనంతరం రామచంద్రగూడెం శివారులో హత్యకు గురయ్యాడు. ఈ క్రమంలో రాజశేఖర్‌ను తానే హత్య చేశానని వెంకన్న అనే వ్యక్తి శుక‍్రవారం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. 

ఇదిలా ఉండగా.. హత్య అనంతరం రాజశేఖర్‌ మృతదేహాన్ని వెంకన్న ఓ కాలువలో పాతి పెట్టాడు. దీంతో గ్రామ ప్రజలు(400 మంది వరకు) రాజశేఖర్‌ మృతదేహం కోసం రసూల్ గూడెం- రామచంద్రాపురం మధ్యలో గాలించారు. ఎట్టకేలకు శనివారం మధ్యాహ్నం రాజశేఖర్‌ మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. మరోవైపు.. హత్య చేయబడ్డ రాజశేఖర్, హత్య చేసిన వెంకన్న ఇద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు కావడం గమనార్హం. రాజశేఖర్‌ హత్య నేపథ్యంలో వెంకన్నకు కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. ఇక, రాజశేఖర్‌ హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: పబ్‌కు వచ్చిన బాలికపై సామూహిక అత్యాచారం.. అసలేం జరిగింది?


 

మరిన్ని వార్తలు