ప్లాట్‌పై కన్నేసి.. నకిలీ పత్రాలతో స్థలం కబ్జా

19 Jul, 2021 11:27 IST|Sakshi
నిందితుడు షేక్‌ హస్సన్‌

అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు

హస్తినాపురం: ప్లాట్‌ యజమాని పేరుతో నకిలీ ఆధార్‌కార్డు, పాన్‌కార్డులు తయారు చేసి కోటి రూపాయల ప్లాట్‌ను రిజిస్ట్రేషన్‌ చేసుకున్న కేసులో ప్రధాన నిందితుడు షేక్‌ హస్సన్‌(56)ను ఆదివారం వనస్థలిపురం పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. నగరంలోని గౌలిగూడచమన్‌కు చెందిన బాలేశ్వర్‌ 1984లో పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మన్సురాబాద్‌ జడ్జెస్‌ కాలనీలో సర్వే నంబర్‌–33లో 267 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు.

ఈ ప్లాట్‌పై కన్నేసిన ఎన్‌టీఆర్‌నగర్‌కు చెందిన షేక్‌ హస్సన్‌ పథకం ప్రకారం వివిధ జిల్లాలకు చెందిన వ్యక్తులతో ముఠాగా ఏర్పడి నకిలీ పత్రాలతో సదరు ప్లాట్‌ను రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన హస్సన్‌ మూడు నెలలకు పైగా పరారీలో ఉన్నాడని, అతడిని ఆదివారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.  

మరిన్ని వార్తలు