మహిళను చెరబట్టాడు.. కుమార్తెపై కన్నేశాడు 

1 Jul, 2021 04:04 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తల్లీ కుమార్తెలను చిత్రహింసలకు గురి చేస్తున్న కామాంధుడు 

మంగళగిరి: భర్త వదిలేసిన మహిళను చెరబట్టడమే కాక ఆమె కుమార్తెను తనకిచ్చి వివాహం చేయాలని తల్లీ కుమార్తెలను చిత్రహింసలకు గురిచేస్తున్న కామాంధుడి ఉదంతమిది. గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి బాధితులు పోలీసులకు తెలిపిన వివరాలు.. మంగళగిరికి చెందిన గోలి సాంబశివరావు కొన్నేళ్లుగా భర్త వదిలేసిన మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఆ మహిళకు ఒక కుమార్తె ఉండగా.. తల్లితోనే ఉంటోంది. డిగ్రీ చదువుతున్న ఆ యువతికి పెళ్లి చేసేందుకు తల్లి ప్రయత్నాలు చేస్తుండగా.. 

ఆమెపైనా కన్నేసిన సాంబశివరావు అడ్డుకుంటున్నాడు. చిన్నతనం నుంచీ తన తల్లితో ఉంటున్న సాంబశివరావును ఆ యువతి తండ్రిగానే పిలుస్తోంది. తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి తనను కూడా పెళ్లి చేసుకుంటాననడంతో ఆ యువతి తట్టుకోలేక ఎదురుతిరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన సాంబశివరావు తల్లీ కుమార్తెలను వారం రోజులుగా ఇంట్లోనే ఉంచి చిత్రహింసలు పెట్టాడు. బుధవారం ఆ యువతిని బెల్ట్‌తో చితకబాదడంతో తట్టుకోలేకపోయిన తల్లీ కుమార్తెలు ఇంటి నుంచి బయటపడి పోలీసులను ఆశ్రయించారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు