చికెన్ కాకుండా వంకాయ కూర వండిందని భార్యపై భర్త సీరియస్‌, నిద్రిస్తున్న సమయంలో..

13 Jul, 2023 12:50 IST|Sakshi

పెరిగిపోతోన్న కోప తాపాలు

చిన్న కారణాలపై దాడులు

భార్యాభర్తల మీద విభేదాలు

ఓపిక, సహనం ఉండాలంటున్న పెద్దలు

సాక్షి, మంచిర్యాల జిల్లా: చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలో నచ్చిన కూర వండలేదని భార్యను భర్త దారుణంగా హత్య చేశాడు. రాత్రి  చికెన్ వండాలని కోరితే.. వంకాయ కూర వండిందని అదే రాత్రి భార్యను గోడ్డలితో‌‌  దారుణంగా హత్యచేశాడు.

భార్య గాలిపెల్లి శంకరమ్మ (45) నిద్రిస్తున్న సమయంలో భర్త గాలిపెల్లి పోశం (50) గొడ్డలితో అత్యంత కిరాతకంగా నరికి చంపి పరారయ్యారు. నిందితుని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఇటీవలి కాలంలో ఇలాంటి కేసులు వీపరీతంగా పెరిగిపోతున్నాయని పోలీసులు చెబుతున్నారు.  చిన్న కారణాలపై ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారని, ఇది వరకు మాటలకు పరిమితమయిన వాళ్లు ఇప్పుడు చేతలకు దిగుతున్నారని తెలిపారు. పెరిగిపోతోన్న కోప తాపాలను అదుపులో పెట్టుకోవాలని, భార్యాభర్తలిద్దరికీ ఓపిక, సహనం ఉండాలని సూచిస్తున్నారు. 


చదవండి: పెళ్లయిన పది రోజులకే నవవధువు ఆత్మహత్య

మరిన్ని వార్తలు