సాక్షి ఎఫెక్ట్‌: మంచిర్యాల లోన్‌ యాప్‌ మృతిపై కేసు నమోదు

18 May, 2022 20:44 IST|Sakshi

సాక్షి, మంచిర్యాల: జిల్లా  కేంద్రంలో లోన్  యాప్ నిర్వాహకుల వేధింపులకు.. కళ్యాణి అనే వివాహిత మృతి చెందిన ఘటన తాలుకా సాక్షి కథనానికి పోలీసులు స్పందించారు. కళ్యాణి మృతిపై విచారణ ప్రారంభించినట్లు వెల్లడించారు. ఇప్పటికే ఐపీసీ సెక్షన్‌ 306 సెక్షన్  ప్రకారం  కేసు నమోదు చేసుకున్నారు.  

యాప్ వేధింపులపై కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా మంచిర్యాల డీసీపీ అఖిల్‌ మహాజన్‌ హెచ్చరించారు. లోన్‌ యాప్‌ బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకొచ్చి పిర్యాదు చేయాలని.. వాళ్లపై చర్యలు తీసుకుంటామని డీసీపీ భరోసా ఇస్తున్నారు.

చదవండి: మంచిర్యాలలో లోన్‌ యాప్‌ వేధింపులు.. వివాహిత ఆత్మహత్య

మరిన్ని వార్తలు