‘పోలీస్ శాఖలో ఉద్యోగాలు, ఐపీఎస్ స్వాతి లక్రా పేరుతో నియామక పత్రాలు’

20 Aug, 2021 22:22 IST|Sakshi

సాక్షి, మంచిర్యాల: జిల్లా కేంద్రంలో ఘరానా మోసం బయటపడింది. నిరుద్యోగ యువతులను పోలీస్ శాఖలో ఉద్యోగాలంటూ బురిడి కొట్టించిన ఘటన వెలుగు చూసింది. ఏకంగా ఐపీఎస్ స్వాతి లక్రా పేరుతో నియామక పత్రాలు సృష్టించి పోలీస్ శాఖలో ఉమెన్ సేప్టీ వింగ్ లొ ఉద్యోగాలు పొందినట్టు 10 మంది నిరుద్యోగ యువతులకు భూక్యా తిరుపతి అనే వ్యక్తి నియామక పత్రాలు జారీ చేశాడు. తీరా ఈ నియామక పత్రాలు నకిలివని తేలడంతో మోసపోయామని తెలుసుకున్న యువతులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు బండారం బయటపడింది.

వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గుడిపేట గ్రామానికి చెందిన భూక్యా తిరుపతి అనే నిందితుడు అమ్మ ఫౌండేషన్ పేరుతో ఈ మోసాలకు పాల్పడ్డట్టు తేలింది. నిర్మల్ జిల్లాకు చెందిన 5 గురు యువతులు , ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్, ఇచ్చోడకు చెందిన 6 గురు  మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన మరో ఏడుగురి వద్ద నుండి పోలీసు శాఖలొప ఉద్యోగాల పేరుతో 2 లక్షలు వసూలు చేసినట్టు తేలింది.

బాధిత యువతుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టిపోలీసులు 24 గంటల్లో నిందితుడు తిరుపతి మంచిర్యాల పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశ పెట్టారు. అనంతరం మంచిర్యాల డిసిపి ఉదయ్ కుమార్ రెడ్డి పూర్తీ వివరాలు వెల్లడించారు. నిందితుడి వద్ద నుండి ఒక సెల్ పోన్, 10 నకిలీ ఉద్యోగ దృవికరణ పత్రాలు, 58 వేల నగదు స్వాదీనం చేసుకున్నారు. నిందితుడిపై 420, 468, ఐపీసీ సెక్షన్ 66, 66డీకింద కేసు నమోదు చేసామని పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు