Cab Driver:మణికొండలో యువతితో క్యాబ్‌ డ్రైవర్‌ అసభ్య ప్రవర్తన 

6 Oct, 2021 14:01 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

క్యాబ్‌ డ్రైవర్‌కు దేహశుద్ధి

సాక్షి, మణికొండ: తన క్యాబ్‌లో వచ్చిన ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించిన డ్రైవర్‌కు స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని హైదర్‌షాకోట్‌ సన్‌సిటీలో మంగళవారం రాత్రి జరిగింది. సన్‌సిటీలో నివసిస్తున్న ఓ యువతి హైదరాబాద్‌ నుంచి క్యాబ్‌లో హైదర్‌షాకోట్‌కు వచ్చింది.

ఆ తరుణంతో డ్రైవర్‌ ఆ యువతితో అసభ్యంగా మాట్లాడటం, చేయిపట్టుకుని లాగటంతో ఆమె క్యాబ్‌ దిగగానే స్థానికులకు ఆ విషయం తెలిపింది. దీంతో అక్కడున్న వారు అతనికి దేహశుద్ధి చేసి నార్సింగి పోలీసులకు అప్పగించారు. అతడిపై కేసు నమోదు చేశామని సెక్టార్‌ ఎస్‌ఐ అన్వేష్‌రెడ్డి తెలిపారు.   
(చదవండి: ప్రాణం తీసిన వివాహేతర సంబంధం )

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు