మన్యంలో మావోయిస్టుల ఘాతుకం

14 Dec, 2020 16:37 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని సింహాచలం ప్రాంతంలో మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీస్ ఇన్ఫార్మర్‌గా అనుమానించి గెమ్మెలి కృష్ణారావు అనే గిరిజనుడిని దారుణంగా హతమార్చారు. ఈ ఘటన జి.మాడుగుల మండలం వాక పల్లె గ్రామం సోమవారం జరిగింది. కృష్ణారావును హత్య చేసి మావోయిస్టులు అక్కడ ఒక లేఖనును వదిలి వెళ్లారు. ఏ పాపం ఎరుగని తన భర్తను ఈ తెల్లవారుజామున ఇంటి నుంచి ఇద్దరు మావోయిస్టులు లాక్కెళ్లి, చంపేశారని మృతుని భార్య భోరున విలపించింది. ముక్కుపచ్చలారని తన ముగ్గురు పిల్లలు, తాను అనాధగా మిగిలిపోయామని కన్నీరుమున్నీరైంది. కాగా, ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో ఇద్దరు మావోయిస్టులను పోలీసులు హతమార్చిన గంటల వ్యవధిలోనే ఇన్ఫార్మర్ పేరిట గిరిజనుడిని హతమార్చడంతో మన్యంలో అలజడి మొదలైంది. పోలీసు ఇన్ఫార్మర్లుగా ఉంటూ ఆదివాసీల హక్కుల్ని కాలరాస్తున్నారని, కృష్ణారావు వైఖరిపై మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు