మావోయిస్టు కీలకనేతలు అరెస్ట్..

12 Aug, 2021 11:49 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,అమరావతి: మావోయిస్టుల కోసం పోలీసులు నిరంతరం కూంబింగ్‌ నిర్వహిస్తునే ఉన్నారు. ఈ క్రమంలో మావోయిస్టు కీలకనేతలు పోలీసులుకు చిక్కినట్టు తెలుస్తోంది. పోలీసులు చెపట్టిన స్పెషల్‌ ఆపరేషన్‌ ద్వారా కలిమెల దళ సభ్యులును అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో కీలకంగా పనిచేసిన దళ సభ్యులు ఉన్నట్లు తెలుస్తుండగా..అది ఎవరు అనేది మాత్రం తెలియాల్సి ఉంది. దీనిపై ఇవాళ మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్‌ సవాంగ్ మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు.
 

మరిన్ని వార్తలు