పంచాయతీ కార్యదర్శిని కర్రలతో కొట్టి చంపిన మావోలు

17 Apr, 2021 16:38 IST|Sakshi

ఛత్తీస్‌గఢ్: నారాయణపూర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీ కార్యదర్శిని మావోయిస్టులు హత్య చేశారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. నారాయణపూర్ జిల్లాలోని ఓర్చా బ్లాక్‌లో గల పోచావాడ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్న హరక్ చౌదరిని మావోయిస్టులు కర్రలతో కొట్టి చంపారు.

పంచాయతీ పనుల కోసం రోహ్తాద్ గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో మావోయిస్టులు ఆపి అతనిపై దారుణంగా దాడి చేశారు. వారి దాడిలో చనిపోయిన తర్వాత మృతదేహాన్ని పులియా సమీపంలో రహదారిపై పడేశారు. మావోయిస్టులు  మృతదేహం వద్ద కరపత్రాలు వదిలేసి వెళ్లిపోయారు. గ్రామస్తుల సహకారంతో మృతదేహాన్ని ఓర్చాకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: ఇంట్లోకి వస్తువులు తెచ్చుకుందామని.. చిన్నారిని

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు